- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండపైన స్విమ్మింగ్ పూల్.. ఆనంద్ మహీంద్రా ఫిదా
దిశ, ఫీచర్స్: జలసిరులు కురిపించే జలపాతాలు, ఆకాశాన్ని తాకే పర్వతశిఖరాలు, ఆకుపచ్చని వనాల్లో ఆకట్టుకునే సీతాకోక చిలుకలు, మంచుపరుచుకున్న భూభాగాలు, పలకరించే మలయమారుతాలు.. ఇవేకాదు అస్వాదించే మనసుండాలే కానీ రాలిపడే ఆకులు, పోగుపడిన పూలు కూడా కంటికి ఆనందాన్ని పంచుతాయి. ప్రకృతి ఒడిలో అడుగడుగునా అద్భుతాలు పొదిగి ఉన్నాయి. అన్వేషిస్తే మరిన్ని నేచర్ వండర్స్ ప్రపంచానికి పరిచయమవుతాయి. విదేశాల్లోనో, ఫాంటసీ ప్రపంచంలోనే కాదు, మనదేశంలోనూ సహజ సౌందర్య నిధులున్నాయని తెలిపేందుకు.. బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఒకటి.
పల్లెల్లో పొలాల మధ్యలో ఉండే కాలువలు, బావులు చూస్తే.. అరెరె భలే ఉన్నాయని మురిసిపోతుంటాం. వాటిని చూడగానే పెద్దలు కూడా చిన్నపిల్లల్లా మారిపోయి ‘ఈత’ కొడుతుంటారు. అలాంటిది చుట్టూ పర్వతాల మధ్యలో, నీలాల నింగి నీడలో, చెట్లతో చుట్టుముట్టి, బండరాళ్లతో సహజంగా ఏర్పడిన నీటికొలను చూస్తే.. జలకాలాడకుండా ఉండలేం కదా.. ఇపుడు అటువంటి కొలను ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆ ఫొటోను షేర్ చేస్తూ, ఆ నేచర్ వండర్‌ను సందర్శించడానికి వేచి ఉండలేనని ముచ్చటపడుతున్నాడు.
ట్విట్టర్ యూజర్ సిద్ధార్థ్ బకారియా గత నెలలో ఈ ఫోటోను ట్వీట్ చేశాడు. అయితే ఈ చిత్రం ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించడంతో ఆయన తాజాగా ఆ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ “Whaaaat ?? నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇది నా ప్రయాణ బకెట్ జాబితాలో చేరిపోయింది. ఇది ఖచ్చితంగా ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సిద్దార్థ్ బకారియా GPS కోఆర్డినేట్లు కావాలి’ అనే వ్యాఖ్యలు జతచేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయింది.
చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే ప్రకృతి సిద్ధమైన ఈ స్విమ్మింగ్ పూల్ బ్యూటీ దెబ్బతింటుందని, అందువల్ల జిపిఎస్ కోఆర్డినేట్లు దీని అడ్రస్ బహిరంగంగా పంచుకోవద్దని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కొంతమంది ఈ లొకేషన్ ఉత్తరాఖండ్, పిథోరాగర్ జిల్లా, ధార్చులాలోని ఖేలా గ్రామానిదని రివీల్ చేశారు.