- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టుకు సహజ రంగులద్దుదాం..
దిశ, వెబ్ డెస్క్ : చిట్టిపొట్టిగా ఉన్నా.. వాలుజడలా వయ్యారాలు పోతున్నా.. రింగురింగులుగా సుడులు తిరుగుతున్నా.. జలపాతంలా.. సిల్కీగా జారుతున్నా.. నూడుల్స్‌ని తలపించినా.. మలింగాను మరిపించినా.. ‘జుట్టు’తో వచ్చే అందమే అందం. మగువల జడలైనా.. మగాళ్ల క్రాఫ్‌లైనా, వాటితో చేసే ప్రయోగాలు కొవిడ్ మీద కూడా జరిగి ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే జుట్టుకు రకరకాల రంగులద్దడం కొత్త ట్రెండ్ కాకపోయినా.. ఇప్పటికీ అది ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంటోంది.
హెయిర్‌కు కలర్స్ వేయడం వల్ల ఓ కొత్త లుక్ రావడం సహజమే. అయితే మార్కెట్లో లభించే హెయిర్ డైస్‌లో టాక్సిక్ కెమికల్స్, డేంజరస్ సింథటిక్స్ ఉండటం వల్ల హెయిర్ డ్యామేజ్ అయి చాలా డల్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. కెమికల్ హెయిర్ డైస్ కాకుండా మన ఇంట్లోనే ‘నేచురల్ కలర్స్’ను హెయిర్‌కు అప్లయ్ చేయాలి. దీంతో జుట్టుకు రంగుతో పాటు పోషకాలు కూడా అందుతాయి.
బీట్‌రూట్ బ్రైట్‌నెస్:
జుట్టుకు రెడ్డిష్ షేడ్ కలర్ కావాలనుకుంటే అందుకు బీట్ రూట్ జ్యూస్ ట్రై చేయొచ్చు. కప్పు బీట్‌రూట్ జ్యూస్, కప్పు క్యారెట్ జ్యూస్ రెండింటిని కలిపి.. ఓ స్ప్రే బాటిల్‌లో తీసుకుని జట్టుపై స్ప్రే చేయాలి. ఓ మూడు గంటల పాటు ఆ కలరింగ్ హెయిర్‌ను అలానే ఉంచి, ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అప్పుడు జుట్టు రంగులో మార్పును గమనించవచ్చు.
నిమ్మ నిగనిగలు :
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. లెమన్ జ్యూస్ కూడా చక్కని నేచురల్ హెయిర్ డై. లెమన్ జ్యూస్‌కు కాసిన్ని నీళ్లు యాడ్ చేసి, జుట్టుపై స్పే చేయాలి. ఆ తర్వాత ఓ గంట పాటు జుట్టును ఆరనిచ్చాక, నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. దీని వల్ల హెయిర్ షైన్ అవుతుంది.
కాఫీ మెరుపులు :
గ్రే హెయిర్ కోసం.. కాఫీ పొడిని ట్రై చేయొచ్చు. ముందుగా కాఫీ పొడితో డికాషన్ చేయాలి (బ్లాక్ కాఫీ). తర్వాత చల్లార్చిన డికాషషన్‌ను స్పే బాటిల్‌లో పోసుకుని, హెయిర్‌పై స్పే చేసి గంట తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేయాలి. షాంపూ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టుకు డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది. అంతేకాదు హెయిర్ క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది.
చామంతి చమక్కు :
లైట్ హెయిర్ షేడ్ కోసం.. చామంతులను ఉపయోగించవచ్చు. అరకప్పు చామంతులను నీళ్లలో వేసి, మంచిగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఓ గంట పాటు చల్లారబెట్టిన అనంతరం ఆ వాటర్‌ను కుదుళ్లకు పట్టించాలి. కనీసం 15 నిముషాలు ఆరనిచ్చాక.. కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టుకు బ్రైట్ కలర్ వస్తుంది.
బ్లాక్ టీ తళుకులు :
5 టేబుల్ స్పూన్ల చాపత్తి లేదా 5 టీ బ్యాగ్స్‌ను తీసుకుని, వాటర్‌లో వేసి మరగనివ్వాలి. చల్లారక జుట్టుకు అప్లయ్ చేసుకుని, ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. దీనివల్ల హెయిర్ డార్క్‌గా తయారవుతుంది.