Bengaluru: అక్కడ 41 ఏళ్లలో ఇదే తొలిసారి.. ఆందోళనలో ప్రజలు..

by Indraja |   ( Updated:2024-05-02 12:46:07.0  )
Bengaluru: అక్కడ 41 ఏళ్లలో ఇదే తొలిసారి.. ఆందోళనలో ప్రజలు..
X

దిశ వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి చిరునామాగా బెంగుళూరు పేరుగాంచింది. అయితే ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల కారణంగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బెంగుళూరులో వీస్తున్న తీవ్రమైన వడగాలులు, వాతావరణ మార్పుల కారణంగా అక్కడ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎప్పుడూ చల్లగా ఎండే బెంగళూరు ప్రస్తుతం అసాధారణంగా వేడి వేసవిని ఎదుర్కొంటోంది. ఇక ఇప్పటికే నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నగరవాసులకు భారత వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బెంగుళూరులో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓక్కసారి కూడ వర్షం పడలేదని తెలిపింది. అలానే ఏప్రిల్‌లో బెంగుళూరులో వర్షపాతం నమోదు కాకపోవడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి అని పేర్కొంది.

సాధారణంగా బెంగుళూరు నగరంలో నీటి అవసరాలకు, భూగర్భజలాల పెరుగుదలకు ఏప్రిల్ నెలలో కురిసే వర్షాలు కీలక పాత్రపోషిస్తోయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వర్షాలు కురవలేదు. దీనితో బెంగులూరు వాసులు ఆదోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed