‘నారీశక్తి’ అనడం కాదు.. వాళ్లకొక మేలు చేయండి.. కేంద్రానికి సీజేఐ హితవు

by Hajipasha |   ( Updated:2024-02-19 19:09:41.0  )
‘నారీశక్తి’  అనడం కాదు.. వాళ్లకొక మేలు చేయండి.. కేంద్రానికి సీజేఐ హితవు
X

దిశ, నేషనల్ బ్యూరో : పదేపదే నారీ శక్తి గురించి ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. మహిళలకు కోస్ట్ గార్డ్ విభాగంలో పర్మినెంట్ కమిషనింగ్ కల్పించడంలో మాత్రం వివక్షను ప్రదర్శిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. కోస్ట్ గార్డ్ విభాగంలో మహిళా సిబ్బందికి లైఫ్ టైమ్ పోస్టింగ్ అవకాశాన్ని కల్పించే విషయంలోనూ పురుషాధిక్య పోకడలతో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. నారీ శక్తి గురించి చెప్పడం కాదు.. వీలైతే కోస్ట్ గార్డ్ విభాగంలో మహిళలకు పర్మినెంట్ కమిషనింగ్ కల్పించడం ద్వారా మాటలకు చేతల రూపమివ్వాలని మోడీ సర్కారుకు సీజేఐ సూచించారు. పర్మినెంట్ కమిషనింగ్ అంటే.. రిటైరయ్యే వరకు ఒకే విభాగంలో పనిచేసే అవకాశాన్ని పొందడం. గతంలో కోస్ట్‌ గార్డ్ విభాగంలో ప్రియాంకా త్యాగి అనే మహిళ షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేసేది. అయితే తనకు కోస్ట్‌ గార్డ్ విభాగంలోనే శాశ్వతమైన పోస్టింగ్ (పర్మినెంట్ కమిషనింగ్) కల్పించాలని ప్రియాంకా త్యాగి కోరింది. దీంతో ఆమెను వెంటనే కోస్ట్ గార్డ్ విధుల నుంచి రిలీవ్ చేశారు. అనంతరం ఆమె ప్రియాంకా త్యాగి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపుతట్టగా.. ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed