కశ్మీర్‌ పర్యటనలో ప్రపంచ సుందరీమణులు.. లంచ్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులు

by Mahesh |   ( Updated:2023-08-28 12:04:42.0  )
కశ్మీర్‌ పర్యటనలో ప్రపంచ సుందరీమణులు.. లంచ్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ సుందరి కరోలినా బిలావ్‌స్కా ప్రకృతి అందాలను వీక్షించేందుకు జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆమె ఒక రోజు పర్యటన నిమిత్తం శ్రీనగర్‌కు ఒక కార్యక్రమం కోసం వచ్చారు. ఆమెతోపాటు మిస్‌ వరల్డ్‌ ఇండియా సైని శెట్టి, మిస్‌ వరల్డ్‌ కరేబియన్‌ ఎమ్మి పెనా కూడా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అందగత్తెలంతా తమ టీమ్స్‌తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్లు ఓ రిసార్టులో లంచ్‌ చేస్తూ తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story