ఇజ్రాయెల్ పశ్చాత్తాపపడేలా చేసేందుకు వెనుకాడబోం- ఇరాన్

by Dishanational6 |
ఇజ్రాయెల్ పశ్చాత్తాపపడేలా చేసేందుకు వెనుకాడబోం- ఇరాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అమీర్ అబ్దోల్లాహియాన్ భద్రతామండలిలో ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసేందుకు ఇరాన్ వెనుకాడబోదని హెచ్చరించారు. తమ దేశంపైనా ఏదైనాదాడికి యత్నిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు ఇరాన్ విదేశాంగమంత్రి. ఇజ్రాయెల్ ప్రభుత్వం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తే.. ఇరాన్ చూస్తూ ఊరుకోదందన్నారు. దాడికి ప్రతిదాడి చేసేందుకు కొంచెం కూడా వెనుకాదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి తెలిపారు ఇరాన్ విదేశాంగమంత్రి.

ఇకపోతే, ఇటీవలే ఇజ్రాయెల్ పై దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. ఆ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒకరు గాయపడ్డాడు. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. డమాస్కస్ కాన్సులేట్‌పై జరిగిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడికి అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేయడం గమనార్హం.

Next Story

Most Viewed