బార్డర్‌లో 200 మంది పాక్ ఉగ్రవాదులు.. దేశంలోకి చొరబడేందుకు యత్నాలు

by Vinod kumar |
బార్డర్‌లో 200 మంది పాక్ ఉగ్రవాదులు.. దేశంలోకి చొరబడేందుకు యత్నాలు
X

శ్రీనగర్ : బార్డర్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్తాన్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారని భారత సైన్యం నార్తర్న్ కమాండ్‌ చీఫ్‌, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. భారత భద్రతా దళాల అప్రమత్తత కారణంగా ఉగ్రమూకల ఆటలు సాగడం లేదన్నారు. గత 9 నెలల్లో 46 మంది ఉగ్రవాదులను బార్డర్‌లో హతమార్చామని చెప్పారు. వారిలో 37 మంది విదేశీయులు కాగా.. 9 మంది స్థానికులు అని పేర్కొన్నారు.

జమ్మూ ఐఐటీలో నిర్వహించిన ‘నార్త్‌ టెక్నో సింపోజియం-2023’లో ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాక్‌.. రాజౌరి, పూంఛ్‌ జిల్లాల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. ఏ ఒక్క చొరబాటుదారుడినీ భారత్‌లోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘భారతదేశ భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఆక్రమించలేదనే విషయమే వాస్తవం’ అని లద్ధాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ (విశ్రాంత బ్రిగేడ్) బీడీ మిశ్రా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed