Guwahati: గ్యాంగ్ రేప్ వీడియో వైరల్.. 8 మంది నిందితులు అరెస్టు

by Shamantha N |
Guwahati: గ్యాంగ్ రేప్ వీడియో వైరల్.. 8 మంది నిందితులు అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలోని గౌహతిలో(Guwahati) బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్(gangrape of a girl in a Guwahati temple) వీడియో వైరల్ గా మారింది. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 17న రాస్ మహోత్సవ్ సందర్భంగా గౌహతిలోని ఆలయ ఆవరణలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న నిందితుడు బాలికపై దారుణానికి ఒడిగట్టి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో(social media platforms) చేరుకున్నారు. వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బాధితురాలు ఎవరనేదానిని గుర్తించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

ఎనిమిది మంది అరెస్టు

శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో గోర్చుక్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి ధర్మేంద్ర కలితకు వాట్సాప్‌లో వీడియో వచ్చిందని గౌహతి వెస్ట్ డీసీపీ పద్మనాభ్ బారుహ్ అన్నారు. కాగా.. ఆ దారుణానికి ఒడిగట్టిన తొమ్మిది మందిని గుర్తించామన్నారు. అయితే, 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించన వీడియో సోషల్ మీడియాలో అందితే.. అది ఎవరికీ ఫార్వార్డ చేయొద్దని పోలీసులకు ప్రజలను కోరారు. ఆ వీడియోను ఫార్వార్డ్ చేయడం కూడా నేరపూరిత చర్య అని.. అలాంచి చర్యలకు పాల్పడిన అందిరపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed