ఓన్లీ నాలుగు.. పెద్దలసభలో మెజారిటీకి చేరువలో ఎన్డీఏ

by Hajipasha |
ఓన్లీ నాలుగు.. పెద్దలసభలో మెజారిటీకి చేరువలో ఎన్డీఏ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటుకుంది. 56 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 30 సీట్లను బీజేపీ సింగిల్‌గా కైవసం చేసుకుంది. వీటిలో పోటీ లేకుండానే గెలిచిన సీట్లు 20 ఉన్నాయి. దీంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఒక్కసారిగా పెద్దలసభలో మెజారిటీ మార్క్‌‌కు మరింత చేరువైంది. రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్య 97కు పెరగగా.. మొత్తం ఎన్డీఏ కూటమి బలం 117కు చేరింది. మొత్తం 240 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో మెజారిటీ సాధించాలంటే 121 మంది సభ్యుల బలం అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం నాలుగు సీట్ల దూరంలో ఎన్డీఏ కూటమి నిలవడం గమనార్హం. ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాల్లో 41 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మూడు రాష్ట్రాలకు చెందిన 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నిక జరిగింది. వీటిలో 10 సీట్లు బీజేపీ గెల్చుకోగా, కాంగ్రెస్ 3, సమాజ్‌వాదీ పార్టీ 2 దక్కించుకున్నాయి. రాజ్యసభలో విపక్ష ‘ఇండియా’ కూటమికి 89 మంది ఎంపీల బలం ఉంది. కాంగ్రెస్‌ సంఖ్యా బలం 29కి చేరుకోగా, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, డీఎంకేకు 10, ఆప్‌కు 10, బీజేపీకి 9, వైఎస్ఆర్‌సీపీకి 9, బీఆర్ఎస్‌కు 7, ఆర్జేడీకి 6, సీపీఎంకు 5, ఏఐఏడీఎంకేకు 4, జేడీయూకు 4 మంది ఎంపీలున్నారు.

Advertisement

Next Story

Most Viewed