Rahul Gandhi : రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దాటిస్తాం : రాహుల్‌గాంధీ

by Hajipasha |   ( Updated:2024-09-11 16:57:14.0  )
Rahul Gandhi : రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దాటిస్తాం : రాహుల్‌గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలకు కొందరు తప్పుడు భాష్యం చెబుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధిచెందే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దాటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని రాహుల్‌గాంధీ వెల్లడించారు.

తాను ఎన్నడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. భారతదేశ జనాభాలో 90 శాతం మేర ఉన్న ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారికి పాలనలో సముచితమైన భాగస్వామ్యం దక్కేలా చేస్తామన్నారు. ఈ అన్యాయాన్ని ఆపేందుకు కులగణనను ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed