ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతునిస్తే.. మేం ఆ పనిచేస్తాం : పుతిన్

by Shamantha N |
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతునిస్తే.. మేం ఆ పనిచేస్తాం : పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉద్రిక్తతలపై అమెరికా జోక్యం చేసుకోవద్దని పుతిన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్‌లను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పుతిన్ బెదిరింపులకు దిగారు. బైడెన్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే.. తామేమి చేతులు కట్టుకుని కూర్చోలేదని మండిపడ్డారు.

ఇకపోతే, ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని బైడెన్ అన్నారు. ఇదే విషయాన్నినెతన్యాహుకు తెలిపానని వివరించారు. తాము ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేసినట్లు ప్రకటించారు. భవిష్యత్ లోనూ దీన్నే కొనసాగిస్తామన్నారు. ఇరాన్ దాడులను ఖండిస్తునానని స్పష్టం చేశారు.

ఇరాన్‌ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను తమపై ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాటిల్లో కొన్ని మాత్రమే తమ భూభాగంలోకి వచ్చాయని తెలిపింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒకరు గాయపడ్డాడు. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి. డమాస్కస్ కాన్సులేట్‌పై జరిగిన ఘోరమైన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story