- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్ తిరిగి తెస్తాం: డీకే శివకుమార్
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ ఎత్తివేసిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ను తిరిగి అమలు చేస్తామని ఆదివారం ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. ‘రిజర్వేషన్లు ఆస్తుల వలె పంచుదామని బీజేపీ భావిస్తోంది. ఇది ఆస్తి కాదు. మైనార్టీల హక్కు’ అని అన్నారు.
వారి రిజర్వేషన్‌ను ఎత్తివేయాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. వారు తమ కుటుంబ సభ్యులేనని... ఇతర ప్రజలు కూడా బీజేపీ నిర్ణయాన్ని తిరస్కరిస్తారని తెలిపారు. మరో 45 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. వచ్చిన వెంటనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎత్తివేస్తామని చెప్పారు. భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టాలని బొమ్మై ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. అయితే మతాన్ని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్ కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.