మోడీ ఇప్పటికైనా మణిపూర్‌ను సందర్శిస్తారా?: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే

by vinod kumar |
మోడీ ఇప్పటికైనా మణిపూర్‌ను సందర్శిస్తారా?: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల తర్వాతనైనా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్‌లో పర్యటిస్తారా అని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘మణిపూర్‌లో శాంతి నెలకొనడం పట్ల మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మిలిటెంట్లు దాడులకు తెగపడుతున్నారు. మోహన్ సైతం ఇదే విషయాన్ని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మోడీ ఇప్పుడైనా రాష్ట్రాన్ని సందర్శిస్తారా’ అని నిలదీశారు. ఎన్డీయే భవిష్యత్ గురించి కాక దేశ భవిష్యత్ గురించే తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు.శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)లతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో సమిష్టిగా బరిలోకి దిగుతామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed