13 రోజులకే ఓటీటీలోకి వచ్చిన ప్రిన్స్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |
13 రోజులకే ఓటీటీలోకి వచ్చిన ప్రిన్స్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: యంగ్ హీరో ప్రిన్స్(prince), నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’(Kali). ఈ చిత్రానికి శివ శేషు(Shiva Seshu) దర్శకత్వం వహించగా.. కే. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ నిర్మించారు. అయితే ఇందులోంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ‘కలి’(Kali) సినిమాకు మేకర్స్ అక్టోబర్ 4న థియేటర్స్‌లో విడుదల చేశారు.

అయితే కథ పరంగా బాగానే ఉన్నప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, కలి(Kali) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ (ETV Win)సొంతం చేసుకోగా.. అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే కలి మూవీ విడుదలైన 13 రోజులకే ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed