శంకర్పల్లి లో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవ వేడుకలు

by Mahesh |
శంకర్పల్లి లో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవ వేడుకలు
X

దిశ, శంకర్పల్లి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం శంకరపల్లి లోని పట్టణ పురవీధుల గుండా పద సంచలన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పద సంచలన( శోభాయాత్ర) కార్యక్రమం దసరా ఉత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శంకర్‌పల్లిలోని డీఎంఆర్ గార్డెన్ నుంచి ఇంద్రారెడ్డి చౌరస్తా మార్కెట్ కమిటీ రోడ్డు హనుమాన్ మందిర్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా స్వయం సేవకుల పద సంచలనం కొనసాగింది. గోష్ ప్రణవ నాదం తో.. గోష్ దండ ప్రయోగం పట్టణంలో పలువురిని ఆకర్షించింది. డీఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి దండు రామ్మోహన్, ప్రధాన వక్త దేవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్యక్రమ విశిష్టతను తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించాలని, చెట్లను పెంచి పర్యావరణ కాపాడాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed