- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy: ఏపీలో స్విగ్గీకి బిగ్ రిలీఫ్.. బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హోటల్స్ యాజమాన్యం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP)లో ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్(Online Food Delivery App) స్విగ్గీ(Swiggy)కి భారీ ఊరట లభించింది. ఈ నెల 14 నుంచి ఏపీలో స్విగ్గీని బాయ్‌కాట్(Boycott) చేయాలన్న నిర్ణయాన్ని ఏపీ హోటల్స్ అసోసియేషన్(AP Hotels Association) వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యం నిన్నహోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులతో సుధీర్ఘ చర్చలు జరిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా 12 అంశాలపై చర్చించారు. ఈ చర్చల సందర్భంగా హోటల్స్ అసోసియేషన్ విధించిన షరతులకు(Conditions) స్విగ్గీ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, దీంతో స్విగ్గీని బహిష్కరించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు హోటల్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి, కన్వీనర్ రమణరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి స్విగ్గీతో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా స్విగ్గీ తమకు గత కొన్ని నెలలుగా నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని, ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ఏపీలో స్విగ్గీ అమ్మకాలు నిలిపివేస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.