WildFire: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. నిరాశ్రయులైన వేలాదిమంది

by Rani Yarlagadda |
WildFire: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. నిరాశ్రయులైన వేలాదిమంది
X

దిశ, వెబ్ డెస్క్: కాలిఫోర్నియా(california)లో భారీ కార్చిచ్చు(Wild Fire) రేగింది. లాస్ ఏంజెల్స్ (los angeles) సమీపంలోనున్న పర్వత ప్రాంతాల్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 10 వేల మందిని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 3500 కమ్యూనిటీల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. కార్చిర్చు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. వేలాదిమంది పౌరులు అంధకారంలో మగ్గుతున్నారు. కార్చిర్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మంటలను అదుపుచేయడం ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది.

కేమరిల్లో చుట్టుపక్కల ఉన్న పంటపొలాల్లో కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతుండటంతో.. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వందల అడుగుల ఎత్తువరకూ దట్టమైన పొగ అలుముకుంది. 5 గంటల్లో 62 స్క్వేర్ కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఇప్పటివరకూ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. కానీ.. చాలా ఇళ్లు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed