ఆ గ్రామం నుంచి ఒక్కరు కూడా ఓటేయలేదు.. ఎందుకో తెలుసా?

by Shamantha N |
ఆ గ్రామం నుంచి ఒక్కరు కూడా ఓటేయలేదు.. ఎందుకో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు బహిష్కరించాలని మావోలు పిలుపునిచ్చారు. కానీ చాలా గ్రామాల్లో మాత్రం పోలింగ్ జరిగింది. కానీ కరుడుగట్టిన నక్సల్ నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో ప్రజలు ఎవరూ ఓటు హక్కుని వాడుకోలేదు. చ‌త్తీస్‌గఢ్ లోని బ‌స్తర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో తొలిదశ పోలింగ్ జ‌రిగింది.

బ‌స్త‌ర్ ప్రాంతంలో జ‌రిగిన అనేక న‌క్స‌ల్స్ దాడుల్లో హిడ్మా పాత్ర ఉన్న విష‌యం తెలిసిందే. సుక్మా జిల్లాలో మావోయిస్టుల స్థావరమైన పువర్తి, బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన అనేక దాడుల్లో హిడ్మానే ప్రధాన సూత్రధారి. శుక్ర‌వారం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో 67.56 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. కానీ పువ‌ర్తి గ్రామ పోలింగ్ బూత్ నుంచి ఎవ‌రూ ఓటు హ‌క్కును వాడుకోలేద‌ని తెలిసింది.

పువర్తి గ్రామంలోని ఓటర్లు ఎవరూ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని పువర్తి పోలింగ్ బూత్ బూత్ లెవల్ ఆఫీసర్ జావా పటేల్ తెలిపారు. భయంతోనే గ్రామస్థులు ఓటు వేయలేదని కొందరు అధికారులు తెలిపారు. భ‌యం వ‌ల్ల గ్రామ‌స్థులు ఓటు వేయ‌లేద‌ని బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. పువ‌ర్తి పోలింగ్ బూత్ కింద మూడు గ్రామాలు ఉన్నాయి. దాంట్లో పువ‌ర్తి, టేక‌ల్‌గూడ‌మ్‌, జొన్న‌గూడ ఉన్నాయి. పువ‌ర్తిలో 332 మంది, టేకుల్‌గూడంలో 158 మంది, జొన్న‌గూడ‌లో 157 మంది ఓట‌ర్లు ఉన్నారు. అయితే పువ‌ర్తి గ్రామంలో ఉన్న బూత్ నుంచి ఒక్క‌రు కూడా ఓటు వేయ‌లేదు.

పూవర్తిలో ఎన్నికల శిబిరం ఏర్పాటు చేయడానికంటే ముందు టేకులగూడెంలో భద్రతా సిబ్బంది క్యాంపుని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది, నక్సలైట్ల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది, దాని ఎలైట్ జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలు చనిపోయారు. మరో 17 మంది గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed