హైదరాబాద్ ఎన్ఐఐఎంహెచ్‌కు అరుదైన ఘనత

by Shamantha N |
హైదరాబాద్ ఎన్ఐఐఎంహెచ్‌కు అరుదైన ఘనత
X

దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్(ఎన్‌ఐఐఎంహెచ్)కి అరుదైన ఘనత దక్కింది. ఈ ప్రఖ్యాత సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు లభించింది. వచ్చే నాలుగేళ్ల పాటు తమ సంస్థకు ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ సమన్వయ కేంద్రంగా ఎన్ఐఐఎంహెచ్ పనిచేస్తుందని డబ్ల్యూ‌హెచ్ఓ ప్రకటించింది. మన దేశంలో ఈ గుర్తింపు పొందిన మూడో వైద్య పరిశోధనా సంస్థ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు గుజరాత్‌లోని జామ్‌నగర్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలు డబ్ల్యూహెచ్ఓ నుంచి ఈ అరుదైన గుర్తింపును సాధించాయి. డబ్ల్యూహెచ్ఓ నుంచి ఈ హోదా లభించడం ఓ మైలురాయి అని ఎన్ఐఐఎంహెచ్ డైరెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed