కమలా వర్సెస్ మస్క్.. అబార్షన్లపై సోషల్ మీడియాలో చర్చ

by Shamantha N |
కమలా వర్సెస్ మస్క్.. అబార్షన్లపై సోషల్ మీడియాలో చర్చ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. కాగా.. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు అబార్షన్లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని ఆంక్షలు ఉండాలంటున్నారు. దీనిపైన సోషల్ మీడియా సహా ప్రచార కార్యక్రమాల్లో చర్చ జరుగుతోంది. ట్రంప్ దేశవ్యాప్తంగా అబార్షన్లను నిషేధిస్తానంటున్నారని కమలా హ్యారిస్ ఇటీవల ఎక్స్ లో పోస్టు చేశారు. దీన్ని బైడెన్ నేతృత్వంలోని బృందం ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతుందని తెలిపారు. దీంతో మహిళల సంతానోత్పత్తి హక్కును పరిరక్షిస్తామని వివరించారు. కాగా.. ఆమె పోస్టుపై మస్క్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఎక్స్‌లో అబద్ధాలు పోస్ట్‌ చేయడం ఇక ఎంతమాత్రం కుదరదనే విషయాన్ని రాజకీయ నాయకులు లేదా వారి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే వారు ఎప్పుడు తెలుసుకుంటారు’’ అని ప్రశ్నించారు. అది తప్పుడు వార్త అని ఆమెపై ఫైర్ అయ్యారు.

కమ్యూనిటీ నోట్

అయితే, కమలా హ్యారిస్ పోస్ట్‌పై మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ ‘కమ్యూనిటీ నోట్‌’ ట్యాగ్‌ను జత చేసింది. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్‌ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించింది. దీంతో యూజర్లు దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది. ఇటీవల బైడెన్‌తో జరిగిన చర్చలో తాను అబార్షన్లను నిషేధించబోనని ట్రంప్‌ స్పష్టంగా చెప్పారని మస్క్ పేర్కొన్నారు. ఆమె పోస్ట్‌కు జత చేసిన కమ్యూనిటీ నోట్‌లోనూ మెజారిటీ యూజర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

Advertisement

Next Story