బెంగాల్‌లో బీజేపీ బలపడేందుకు కారణాలివే..

by S Gopi |
బెంగాల్‌లో బీజేపీ బలపడేందుకు కారణాలివే..
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతకుముందు మూడు దశాబ్దాలు, గడిచిన దశాబ్దన్నర కాలంగా కమ్యూనిస్ట్ పార్టీ, టీఎంసీల ఆధీనంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అంటే 30 ఏళ్ల క్రితం బీజేపీ కార్యవర్గ సమావేశం కోసం అటల్ బిహారీ వాజ్‌పేయి కోల్‌కతా వెళ్లారు. ఆ సమయంలో పార్టీ కీలక నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ ముఖ్యనేత అయినప్పటికీ బెంగాల్‌లో పార్టీ పెద్దగా ఎదగకపోవడంపై వాజ్‌పేయి విచారం వ్యక్తం చేశారు. ముఖర్జీకి ఆయన సెక్రటరీ కావడం కూడా ఈ విషయం ఆయన్ను మరింత బాధించింది. అయితే, ఆ తర్వాత 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్‌లో బీజేపీ పట్టు సాధించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. క్రమంగా రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం కమ్యూనిస్టుల నుంచి చేజారగా, తాజాగా మోడీ పట్టుదలతో టీఎంసీ నుంచి కూడా లాక్కొని బీజేపీ విజయాన్ని అందుకోబోయే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సీట్లను పెద్ద సంఖ్యలో గెలవనున్నదని ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్‌లో అంచనా వేసింది. రాష్ట్రంలో బీజేపీకి 26 నుంచి 31 సీట్లు వస్తాయని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి 11 నుంచి 14 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి కీలక ఎస్సీ, ఓబీసీల ఓట్లు పెరుగుతాయని ఎగ్జిట్ పోల్ భావిస్తోంది. అయితే, ఎగ్జి పోల్‌పై టీఎంసీ విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ సర్వేలన్నీ అబద్ధమని పేర్కొంటూ, జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు ఉండాలని చెబుతోంది.

అయితే, ఎగ్జిట్ పోల్ లెక్కలు తుది ఫలితాలు కానప్పటికీ, రాష్ట్రంలో బీజేపీ ఆకట్టుకునే స్థాయిలో పనిచేయడం వెనుక కనీసం 10 అంశాలు ప్రభావం చూపించి ఉంటాయని తెలుస్తోంది. అవెంటో చూద్దాం..

* గత 13 ఏళ్లుగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదటి కారణంగా ఉండొచ్చు. ఇది 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ పట్టు బిగించిన పరిణామాల ద్వారా అవగతమైంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా భారీ విజయం సాధించినప్పటికీ బెంగాల్‌పై బీజేపీ దృష్టి తగ్గలేదు.

* విపత్తుల నిర్వహణ, మహిళలు, పిల్లల భద్రత, రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అక్రమాలు వంటి అంశాలతో 13 ఏళ్ల దీదీ ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని బీజేపీ ఎత్తి చూపడం.

* టీఎంసీపై అవినీతి ఆరోపణలపై ప్రజలౌ బహిరంగంగానే చర్చించుకోవడం, బీజేపీ ఈ విషయాన్ని పదేపదే చర్చలో ఉంచడం ప్రభావం చూపవచ్చు. టీఎంసీ నేతలపై ఇళ్లపై సీబీఐ, ఈడీ దాడులు, కొందరు నేతలు జైలుకెళ్లడం వంటివి బీజేపీకి అనుకూలంగా మారి ఉండొచ్చు.

* సందేశ్‌ఖాలీ అంశం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. మాఫియా రాజ్‌గా మారి భూకబ్జా ఆరోపణలు, మహిళలపై లైంగిక దాడులు వంటివి టీఎంసీగా ప్రతికూలంగా మారిన ముఖ్యమైన అంశాలు.

* బెంగాల్ సీఎం మమతకు మహిళా ఓటర్ల నుంచి కీలక మద్దతు ఉంది. ఉచితంగా నెలవారీ రైల్వే కార్డులు ఇవ్వడం, పేద మహిళల నుంచి చదువుకున్న వారి వరకు అందరూ దీదీ వెనుకే ఉన్నారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ, ఇతర సాంస్కృతిక రంగాల మహిళలు కూడా ఆమెకు మద్దతిస్తారు. దీన్ని దెబ్బతీయడానికే బీజేపీ సందేశ్‌ఖాలీ అంశాన్ని ముందుకు తెచ్చింది. ఇది కొంత దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి ఉండొచ్చు.

* 30 శాతం ముస్లిం ఓట్ల మద్దతు ఉందనే ధీమాతో దీదీ ఎన్నికల బరిలో గర్వంగా నిలిచినప్పటికీ, వారి ఓట్లు చీలితే ఇబ్బందికరం కానుంది. ఎందుకంటే, ఓట్లు చీల్చేందుకు ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ఐఎస్ఎఫ్‌కు బీజేపీ మద్దతిచ్చిందనే ఊహాగానాలు ఉన్నాయి.

* బీజేపీ ఎన్నికల్లో నమ్ముకునే హిందూత్వ ఓట్లు ఈసారి కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. వాజ్‌పేయి, అద్వానీల మాదిరి కాకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా హిందూత్వ సెంటిమెంట్‌ను దూకుడుగా రాష్ట్రంలో పెంచే ప్రయత్నాలు చేశారు.

* ఇటీవల రాష్ట్రాన్ని కుదిపేసిన టీచార్ల నియామకాల్లో అవినీతి కొంత ప్రభావం చూపించి ఉండొచ్చని అంచనా.

* డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం మరొక కీలక అంశం. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ నినాదాన్ని బెంగాలీల మనసుల్లో నాటారు. బెంగాల్‌లోనూ, కేంద్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉండటం అవసరమని మోడీ చెబుతూ వస్తున్నారు. అరుణాచల్, త్రిపుర రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా లబ్ది పొందినపుడు, బెంగాల్ కూడా పొందగలదని చెప్పుకొచ్చారు.

* 2026 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్‌గా కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. 2026లో ప్రభుత్వం మారాలంటే ఇప్పుడు మాకు ఎక్కువ ఓట్లు వేయాలని బీజేపీ ప్రజలను కోరుతోంది.

Advertisement

Next Story