- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగాను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కానీ.. రాందేవ్ బాబాపై సుప్రీం ఏమందంటే?
దిశ, నేషనల్ బ్యూరో: పతంజలి తప్పుడు ప్రకటన కేసులో తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. పతంజలి సంస్థ సహ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా.. యోగాకు ఎంతో చేశారంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనిపై ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసంది. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో రాందేవ్ బాబా కృషి చేశారని అంగీకరించింది. కానీ పతంజలి ఉత్పత్తులు అనేది వేరే అంశమని స్పష్టం చేసింది. రాందేవ్ బాబా ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరని గుర్తుచేసింది. దాన్ని ఆయన సరైన మార్గంలో వాడుకోవాలని హితవు పలికింది. వివాదానికి కారణమైన పతంజలి ఉత్పత్తుల స్టోరేజ్ పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక ఈ కేసులో రాందేవ్ బాబాకు ఉపశమనం దక్కింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని రాందేవ్ బాబాతోపాటు ఆ సంస్థ ఎండీ బాలకృష్ణ చేసిన వినతిని అంగీకరించింది. ప్రస్తుతం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది.