భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

by Shamantha N |
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషవల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గోవా, ముంబైకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దాదాపు 10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గోవాలో రాబోయే రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోవాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది., ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబై, పూణే ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా రెండు నగరాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. రాయ్ గఢ్ లోనూ భారీగా వర్షం కురిసింది. అక్కడ కూడా అధికారులు.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు, ముంబైలో మంగళవారం తెల్లవారుజామున 176 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది

10 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్

కోస్తా ప్రాంతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనావేసింది. అంతేకాకుండా, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ కు వరద హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూలై 10న తెహ్రీ, పౌరీ, భాగేశ్వర్, అల్మోరా, నైనితాల్, చంపావత్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed