J&K: జమ్మూకశ్మీర్ అధికార పీఠాన్ని ఆక్రమించకుండా బీజేపీని అడ్డుకుంటాం: ఒమర్ అబ్దుల్లా

by S Gopi |
J&K: జమ్మూకశ్మీర్ అధికార పీఠాన్ని ఆక్రమించకుండా బీజేపీని అడ్డుకుంటాం: ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ అధికార పీఠం ఆక్రమించకుండా ఆపేందుకు కృషి చేస్తున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గురువారం ఓ ప్రకటనలో అన్నారు. 'బీజేపీ మమ్మల్ని టార్గెట్ చేయలేదంటే, అది మమ్మల్ని పొగిడినట్టు కాదు. వారితో పోటీ పడుతున్నాము. జమ్మూకశ్మీర్‌లో అధికార పీఠాన్ని ఆక్రమించకుండా వారిని అడ్డుకుంటున్నాం. గడిచిన దశాబ్ద కాలంలో వారు జమ్మూకశ్మీర్‌కు చేసిన దానికి బాధ్యత వహించాలని ' అబ్దుల్లా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూకశ్మీర్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇదిలావుండగా, టెర్రర్ ఫండింగ్ కేసులో ఢిల్లీ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత బారాముల్లా ఎంపీ రషీద్ ఇంజనీర్ గురువారం జమ్మూ కాశ్మీర్‌కు బయలుదేరారు. ఇలాంటి దశలో కశ్మీర్ ఎన్నికలు చాలా కీలకమని ఆయన అన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీ విజన్ 'నయా కాశ్మీర్' కుప్పకూలుతుందని తెలిపారు. సత్యం గెలుస్తుందని, నేను న్యాయం ఆశిస్తున్నానని రషీద్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed