Wayanad landslides: వయనాడ్ జలవిలయం.. 401 మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు పూర్తి

by Shamantha N |
Wayanad landslides: వయనాడ్ జలవిలయం.. 401 మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు పూర్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: కొండచరియలు విరిగిపడిన వయనాడ్ సమీప ప్రాంతాల్లో మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. 401 మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తిచేసినట్లు కేరళ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 1,500 మందికి పైగా ఇప్పుడు శిబిరాల్లో ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సహా వందలాది మంది వాలంటీర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. 127 మంది మహిళలు సహా 248 మందికి చెందిన 349 శరీరభాగాలను గుర్తించారు.

మరో మూడు డెడ్ బాడీలు గుర్తింపు

కేరళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె రాజన్ ప్రకారం గుర్తించిన 52 మృతదేహాలు లేదా శరీర భాగాలు కుళ్లిపోయాయి. తదుపరిపరీక్షలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, నిలంబూర్ ప్రాంతం, చలియార్ నదిలో మంగళవారం కూడా అన్వేషణ కొనసాగింది. మరో ముగ్గురి డెడ్ బాడీలను గుర్తించారు. ప్రస్తుతం, ముగ్గురు బిహార్ స్థానికుల బంధువులతో సహా 115 మంది వ్యక్తుల రక్త నమూనాలను సేకరించారు. సహాయక శిబిరాల నుంచి తాత్కాలిక నివాసాలకు తరలించేందుకు కేరళ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వయనాడ్‌లో ఖాళీ ఇళ్లు, నివాస సౌకర్యాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 30 తెల్లవారుజామున వయనాడ్‌లోని చూరల్మల, ముండకై ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 400 మందికి పైగా చనిపోగా.. మరో వంద మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేద

Advertisement

Next Story

Most Viewed