- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షేక్ హసీనాతో సోనియా భేటీ.. గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఇరువురు నేతలు
దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి సోనియా షేక్ హసీనాను కలిశారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పాతజ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరువేసుకున్నారు. సోనియా రాగానే.. షేక్ హసీనా ఎదురువచ్చి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భారత్- బంగ్లాదేశ్ ల మధ్య సత్సంబంధాల బలోపేతానికి విస్తృత అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు పేర్కొంది. కాగా.. శనివారం ఢిల్లీకి వచ్చిన షేక్ హసీనా.. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీ కుటుంబంతో సత్సంబంధాలు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, గాంధీ కుటుంబానికి మధ్య చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్, ఇందిరా గాంధీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీది కీలకపాత్ర. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు.