Waqf land: వక్ఫ్ భూముల సమస్యపై సమీక్షిస్తాం.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర

by vinod kumar |
Waqf land: వక్ఫ్ భూముల సమస్యపై సమీక్షిస్తాం.. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రైతులకు తమ పూర్వీకుల వచ్చిన భూమిని ఖాళీ చేయాలని వక్ఫ్ బోర్డు (wakf board) ఇటీవల ఇచ్చిన నోటీసులను సమీక్షిస్తామని హోం మంత్రి పరమేశ్వర (parameshwara) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖలు దీనిని పరిశీలిస్తాయని, పాత రికార్డుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం ఆయన బెంగళూరు(Bengalur)లో మీడియాతో మాట్లాడారు. భూములను ఖాళీ చేసేందుకు వక్ఫ్ బోర్డు రైతులకు గడువు విధించిందని అయితే దీనిలో సమస్య ఏమీ లేదని వెంటనే రివ్యూ చేస్తామని తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.

కాగా, విజయపుర జిల్లాలోని తేనహళ్లి, తీకోట తాలూకాలోని పలువురు రైతులు తమ భూములు ఖాళీ చేయాలని ఇటీవల వక్ఫ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకెళ్లకుండానే భూ రికార్డులను వక్ఫ్‌కు అనుకూలంగా మార్చి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. మంత్రి బీజీ జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ విజయపురలో పర్యటించి రైతులకు నోటీసులు అందజేయాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించిన వెంటనే తమకు నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు విజయపుర జిల్లా కేంద్రంలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమ భూ రిజిస్ట్రేషన్ పట్టాలు చేత పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పరమేశ్వర స్పందించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed