Khushbu : కాపాడాల్సిన నాన్నే నన్ను వేధించాడు : జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ

by Hajipasha |
Khushbu : కాపాడాల్సిన నాన్నే నన్ను వేధించాడు : జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ
X

దిశ, నేషనల్ బ్యూరో : హేమ కమిటీ నివేదికను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ కోరారు. ప్రతి పరిశ్రమలోనూ సినిమా ఇండస్ట్రీ తరహా పరిస్థితులే ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన వేధింపులను బయట పెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్‌ ఉపయోగపడిందని ఖుష్బూ కొనియాడారు. ఈ విషయంపై తన కూతుళ్లతో కూడా చర్చించినట్లు తెలిపారు.

‘‘బాధితులకు అందరి మద్దతు అవసరం. సమస్య ఎదురైన వెంటనే వారెందుకు మాట్లాడలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. తమకు ఎదురైన వేధింపుల గురించి మాట్లాడే ధైర్యం అందరికీ ఉండదు కదా’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘మా నాన్నే నన్ను బాల్యంలో వేధించారు. ఆ దారుణాన్ని బయటపెట్టడానికి ఎందుకంత టైం తీసుకున్నావని చాలామంది గతంలో నన్ను అడిగారు. నిజమే నేను ముందే మాట్లాడి ఉండాల్సింది. అయితే నాకు ఎదురైన వేధింపులు కెరీర్‌‌‌ను నిర్మించుకునే క్రమంలో జరిగినవి కావని గుర్తుంచుకోవాలి. చాలామంది మహిళలకు కుటుంబం నుంచి సరైన మద్దతు ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఖుష్బూ వ్యాఖ్యానించారు. సినిమా రంగంలోకి వస్తున్న చిన్న గ్రామాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిల ఆశలను ఆదిలోనే తుంచేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed