- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుతిన్‌పై ‘ఇయర్’ డాక్యుమెంటరీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏదో ఒక రోజు తన చుట్టూ ఉన్నవారి చేతిలోనే మరణిస్తారని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తైన నేపథ్యంలో తీస్తున్న ఇయర్ అనే ఉక్రెనియన్ డాక్యుమెంటరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడి నాయకత్వంలో ఘర్షణ కాలం వస్తుందని, ఆయనతో సన్నిహితంగా ఉండే వారే పుతిన్‌పై వ్యతిరేక చర్య తీసుకుంటారని అన్నారు.
అయితే అది ఎప్పుడు జరగుతుందనే విషయాన్ని మాత్రం జెలెన్ స్కీ వెల్లడించలేదు. పుతిన్ పై తన సహచరుల్లో అసహనం పెరుగుతుందని పలు కథనాల నేపథ్యంలో ఈ కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది అధికారులకు పుతిన్ అధికారాన్ని కట్టబట్టడం తో అలాంటివి జరిగే అవకాశాలు లేవని పలు నివేదికలు పేర్కొన్నాయి. క్రిమియన్ ద్వీపకల్పం పై ఉక్రేనియన్ నియంత్రణకు తిరిగి రావడం యుద్ధం ముగింపులో భాగమని జెలెన్ స్కీ చెప్పారు. ఉక్రెయిన్ ప్రతి మూలన దేశ పతాకాన్ని తిరిగి ఎగరవేస్తానని చెప్పారు.