రాజకీయాల నుంచి తప్పుకున్న నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్

by S Gopi |
రాజకీయాల నుంచి తప్పుకున్న నవీన్ పట్నాయక్ సహాయకుడు వీకే పాండియన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాతికేళ్లుగా అధికారంలో ఉన్న ఘోర పరాజయం పాలవడంతో బీజేడీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా ఆదివారం ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ కీలక సహాయకుడు వీకే పాండియన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గతేడాది నవంబర్‌లో సివిల్ సర్వీసెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరిన వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఒక వీడియోను విడుదల చేశారు. అందులో.. నాకున్న ఏకైన ఆస్తి మా తాతముత్తాతల నుంచి సంక్రమించిందే. నాతో పాటు నా కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడా మరే ఆస్తి లేదు. నా జీవితంలో అతిపెద్ద సంపాదన ఒడిశా ప్రజల ప్రేమ, ఆప్యాయత. నవీన్ బాబుకు సహాయం చేయడం ఒక్కటే లక్ష్యంతో తాను రాజకీయాలో చేరానని, ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. బిజూ పరివార్‌తో కలిసి ఉండే కార్యకర్తలతో పాటు మొత్తం బిజూ పరివార్‌కు క్షమాపణలు చెబుతున్నాను ' అంటూ వీకే పాండియన్ చెప్పారు.

ఈసారి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి కాకపోతే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వీకే పాండియన్‌ ప్రచార సమయంలోనే చెప్పారు. ఐఏఎస్‌ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు.. బీజేపీ హవా ఉందని, ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకపోతే, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా' అని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఫలితాల్లో బీజేడీ అధికారం కోల్పోవడమే కాకుండా దారుణ పతనాన్ని చూసింది. కాషాయ పార్టీ భారీ ఆధిక్యత సాధించింది. 21 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేపీ 20 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించింది. బిజూ జనతాదళ్‌(బీజేడీ) ఒక్క స్థానం కూడా గెలవలేదు. అలాగే, 147 అసెంబ్లీ స్థానాలకు గానూ 78 చోట్ల బీజేపీ విజయం సాధించింది. 51 చోట్ల బీజేడీ గెలిచింది. కాంగ్రెస్‌ 14 స్థానాలకు పరిమితమైంది.

2019 ఎన్నికల ముందు నుంచి నవీన్‌కు నమ్మకమైన అధికారిగా ఉన్న వీకే పాండియన్.. గతేడాది నవంబర్‌లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి మరీ బీజేడీలో చేరారు. తెర వెనక ఉంటూ పాలనలో, బీజేడీలో కీలకంగా వ్యవహరించారు. కాగా, భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్న బీజేపీ ముఖ్యమంత్రి ఎవరనేదీ ఖరారు చేయలేదు. మాజీ కేంద్రమంత్రి జోయల్‌ ఓరం, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్రప్రధాన్‌, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, మరో నేత బైజయంత్‌ పండ సీఎం రేసులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed