Vistara: హైదరాబాద్ వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

by Ramesh Goud |   ( Updated:2024-10-25 06:35:27.0  )
Vistara: హైదరాబాద్ వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో జైపూర్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇటీవల విమానాల్లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలు విమానాల్లో తరుచు ప్రయాణించేవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా మరో విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ.. కాల్ వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. జైపూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను దింపేసిన సిబ్బంది.. బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. దీంతో బాంబ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇది ఫేక్ కాల్ అయి ఉండొచ్చని సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed