Darshan : జైల్లో కన్నడ హీరో దర్శన్‌కు సిగరెట్, వీఐపీ ట్రీట్! స్పందించిన సీఎం సిద్దరామయ్య

by Ramesh N |   ( Updated:2024-08-26 14:10:18.0  )
Darshan : జైల్లో కన్నడ హీరో దర్శన్‌కు సిగరెట్, వీఐపీ ట్రీట్! స్పందించిన సీఎం సిద్దరామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో కన్నడ హీరో దర్శన్‌కు జైల్లో అధికారులు రాచ మర్యాదలు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. జైల్లో దర్శన్‌కు వీఐపీ మర్యాదలు కల్పించిన ఏడుగురు అధికారులపై వేటుపడింది. ఈ క్రమంలోనే సొమవారం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. పరప్పన అగ్రహార జైలులో సినీనటుడు దర్శన్‌తో పాటు మరికొందరికి రాజభోగాలు అందించిన కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని సూచించారు.

దర్శన్‌తో పాటు మరికొందరిని తక్షణమే వేర్వేరు జైళ్లకు తరలించాలని, జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని సిద్దరామయ్య ఆదేశించించారు. కాగా, హీరో దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపిస్తున్నాడని చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మర్డర్ కేసులో దర్శన్, అతి ప్రియురాలు పవిత్రతో పాటు హత్యకు కారణమైన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు పరప్పన్ అగ్రహర జైల్లో ఉంటున్నారు.

అయితే తాజాగా జైల్లో దర్శన్ అతని సహచరులు వీఐపీ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని ఆరోపణలతో నెట్టింట ఓ ఫోటో వైరల్‌గా మారింది. అతని గ్యాంగ్‌తో ఒక చేతిలో సిగరేట్, చేతిలో కప్పు పట్టుకోని కూర్చీలో కూర్చోని ముచ్చట్లు పెడుతున్నట్లు తేలిన ఒక ఫోటో వైరల్ అయింది. దర్శన్‌తో పాటు రేణుకా స్వామి హత్యకు సహకరించించిన రైడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ, దర్శన్ మేనేజర్ నాగరాజు, అతని హెయిర్ స్టైలిస్ట్ కుల్లసేన మరొక ఖైదీ కూడా చిల్ అవుతున్నట్లు ఫోటోలో కన్పిస్తుంది. ఇతర ఖైదీలతో పోల్చితే దర్శన్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సిద్దరామయ్య ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందుకు సహకరించిన అధికారులపై విచారణ కొనసాగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed