- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Venkaiah Naidu: మూడు దేశాల పర్యటనలో వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: Vice president venkaiah naidu leaves for 3 countries tour| ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) మూడు దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. వారం రోజులకు పైగా సాగే ఈ పర్యటనలో గెబోన్, సెనెగల్, కతార్ దేశాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా మూడు దేశాలతో కీలకమైన అంశాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భారత ఉపరాష్ట్రపతి ఈ మూడు దేశాల్లో పర్యటించడం ఇదే మొదటి సారి. ఈ పర్యటన ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలతో భారతదేశ సంబంధాల్లో మరింత పురోగతి ఉండనున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు కతార్‌తో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి రెండు రోజుల గెబాన్ పర్యటనలో ఆ దేశ ప్రధానితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఉపరాష్ట్రపతి చర్చలు జరపనున్నారు. జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు మేకీ సాల్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు మౌస్తఫా నియాసీతోపాటు ఇతరులతో ఉప రాష్ట్రపతి సమావేశం కానున్నారు. ఇక, భారత్-సెనెగల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చివరగా జూన్ 4 నుంచి 7 వరకు జరగనున్న కతార్ పర్యటనలో భాగంగా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్‌థానీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఆయా దేశాల్లో భారత సంతతి వారితోను వెంకయ్యనాయుడు ముచ్చటించనున్నారు.