‘వైబ్రేంట్ గుజరాత్’ రాష్ట్రానికి గేమ్ చేంజర్: సీఎం భూపేంద్ర పటేల్

by samatah |
‘వైబ్రేంట్ గుజరాత్’ రాష్ట్రానికి గేమ్ చేంజర్: సీఎం భూపేంద్ర పటేల్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2026-27 నాటికి 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని గుజరాత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ వెల్లడించారు. బుధవారం ప్రారంభమయ్యే 10వ వైబ్రేంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశ జనాభాలో గుజరాత్ జీడీపీ 8.3 శాతానికి పైగా ఉంది. అంతకుముందు ఏడాది.. భారత్ మొత్తం సరుకుల ఎగుమతుల్లో రాష్ట్రం 33 శాతం వాటాను కలిగి ఉంది’ అని చెప్పారు. ఇదే క్రమంలో దేశ జీడీపీకి 10శాతం సహకారం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ అయిన ‘వికసిత్ భారత్ @2047’ సాకారం చేయడంలోనూ గుజరాత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వైబ్రేంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా మారందని తెలిపారు. ప్రస్తుతం జరగబోయే సమ్మిట్ జాతీయ ప్రాధాన్యత, జీ20 ఇతివృత్తాలకు అనుకుణంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక అంశాలపైనే గాక, ప్రపంచ భవిష్యత్‌ను రూపొందిచడంలో కీలక పాత్ర పోషిస్తున్న రంగాలపై దృష్టి సారిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed