- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘వందేభారత్’ వేగం తగ్గుతోంది
దిశ, నేషనల్ బ్యూరో: వందేభారత్ రైలు సగటు వేగం తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గంటకు 84 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 76 కిలోమీటర్లకు తగ్గిందని పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన దరఖాస్తుకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది. వందే భారత్ ట్రైన్ ఆవరేజ్ స్పీడ్ ఎంతో చెప్పాలంటూ మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి రైల్వే శాఖకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు పెట్టారు. వందేభారత్ ట్రైన్ ఆవరేజ్ స్పీడ్ 2021-21లో 84.48 కిలోమీటర్లు ఉండేదని రైల్వే శాఖ తెలిపింది. 2023-24నాటికి ఆ సగటు వేగం 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వేశాఖ తెలిపింది.
వేగం ఎందుకు తగ్గిందంటే..
భౌగోళిక కారణాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేశామని రైల్వే శాఖ తెలిపింది. హైస్పీడ్ కోసం ట్రాక్ పరిస్థితులు అనుకూలించట్లేదని పేర్కొంది. దీంతో, ఢిల్లీ- ఆగ్రా మార్గంలో మినహా దేశంలో ఎక్కడా 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో రైళ్లు వెళ్లలేకపోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వందే భారత్ రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతతో రాజీ పడాల్సి రావచ్చని వెల్లడించింది. వర్షాకాలంలో అన్ని రైళ్లకు గరిష్ఠ వేగాన్ని 75 కిలోమీటర్లుగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.