CM Dhami : చీపురు పట్టి పార్కును ఊడ్చిన సీఎం ధామి

by Hajipasha |
CM Dhami : చీపురు పట్టి పార్కును ఊడ్చిన సీఎం ధామి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి చీపురు చేతపట్టి పార్కులో ఊడ్చారు. పరిసరాలను శుభ్రపరిచారు. బుధవారం డెహ్రాడూన్‌లోని గాంధీ పార్కులో నిర్వహించిన ‘స్వచ్ఛతా అప్నావో, బీమారీ భగావో’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రజలకు ఆయన చాటిచెప్పారు. ఈసందర్భంగా జెండా ఊపి రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెత్తను సేకరించే వాహనాలను సీఎం ధామి అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ నుంచి జిల్లాలకు ఈ వాహనాలను అందిస్తున్నారు. పార్కులోని గాంధీ విగ్రహం పరిసరాలలో ఊడ్చిన అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో సీఎం ధామి ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Next Story