73 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

by srinivas |   ( Updated:2022-09-02 10:17:42.0  )
73 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
X

లక్నో: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. ఈ మేరకు 73 మంది అధికారులకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీఎం హెల్ప్‌లైన్, స్థానిక యంత్రాంగం, జన్ సున్వాయ్ పోర్టల్, సీఎంఓ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా శాఖల అధికారులకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో.. 10 మంది శాఖాధికారులు, కమిషనర్లు-5, జిల్లా మెజిస్ట్రేట్‌లు-10, డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్లు-5, మున్సిపల్ కమిషనర్లు-5, తహసీల్దార్లు-10, ఏడీజీలు+ఐజీలు-3 మంది, ఐజీలు+డీఐజీలు-5గురు, కమిషనరేట్లు-10, పోలీస్ స్టేషన్‌లు-10 ఉన్నాయి.

ఈ మేరకు నోటీసులు అందుకున్న అధికారులు వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జులై నెలలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్రంలోని 73 మంది అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ షోకాజ్ నోటీసులు పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ అనేక సమావేశాల్లో అధికారులకు సూచించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించినా ప్రయోజనం లేదన్నారు. ఈ క్రమంలో ఆయా శాఖల అధికారులపై సీఎం చర్యలకు దిగినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story