Upsc candiates: సివిల్స్ అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి.. ఢిల్లీలో ఎనిమిదో రోజూ కొనసాగిన నిరసన

by vinod kumar |
Upsc candiates: సివిల్స్ అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలి.. ఢిల్లీలో ఎనిమిదో రోజూ కొనసాగిన నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లో వరదల కారణంగా మృతి చెందిన ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం, కోచింగ్ సెంటర్ నుంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిదో రోజూ కొనసాగింది. మృతి చెందిన విద్యార్థులను ఆదుకోవడంతో పాటు ఢిల్లీ కోచింగ్ ఎడ్యుకేషనల్ సెంటర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ముసాయిదాను వెంటనే విడుదల చేయాలని నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల భద్రత కోసం అన్ని వాణిజ్య, వాణిజ్యేతర సంస్థలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ల వద్ద ఫైర్ మార్షల్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.100 కంటే ఎక్కువ మందికి వసతి కల్పిస్తే ఫైర్ మార్షల్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. నిత్యం మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తెలిపారు. అంతేగాక విద్యార్థుల లైబ్రరీల ఫీజులు తగ్గించాలని, ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఫిర్యాదుల డెస్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed