ప్రధాని మోడీ సలహాతో 22 కిలోల బరువు తగ్గిన కేంద్ర మంత్రి..

by Mahesh |   ( Updated:2023-03-08 10:25:45.0  )
ప్రధాని మోడీ సలహాతో 22 కిలోల బరువు తగ్గిన కేంద్ర మంత్రి..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ 22 కిలోల బరువు తగ్గారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఇంతకు ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పారు. ఈ క్రమంలో తాను 2021కి ముందు.. 96 కిలోలు ఉన్నానని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో చేరానని, డాక్టర్లు సూచించిన రెగ్యులర్ డైట్‌ని అనుసరించడం వల్ల 22 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story