- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న అమేథీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ్నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది. ఆస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేఎల్ శర్మ.. స్మృతి ఇరానీపై 28 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో అమేథీ స్థానంలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, బీజేపీ తరఫున స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. కాగా.. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే, ఈసారి అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయలేదు. గాంధీ కుటుంబ విధేయుడిగా పేరున్న కేఎల్ శర్మను కాంగ్రెస్ హైకమాండ్ అమేథీ స్థానం నుంచి బరిలోకి దింపింది. సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. ఆమె పోటీ చేసిన రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ బరిలో నిలిచారు. రాయ్ బరేలీలో 60 వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ కొనసాగుతున్నారు.