- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయనాడ్ విషాదంపై కేంద్రమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి 150 మంది చనిపోగా.. మరో 100 మందికి పైగా గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వయనాడ్‌ను ముంచెత్తిన ఈ ప్రకృతి విపత్తుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ.. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఈ నెల 23వ తేదీనే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. పినరయి విజయన్ సర్కార్‌ను ముందే అలర్ట్ చేసిన ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
వయనాడ్‌లో మరణాల సంఖ్యకు కేరళ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఒక కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సభలో మేం చెప్పకూడదని అనుకున్నామని కానీ ఇంటలిజెన్స్ వ్యవస్థపై కేరళ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేయడంతోనే ఈ విషయాన్ని బయటపెట్టామని పేర్కొన్నారు. కాగా, వయనాడ్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 150 మంది మృతి చెందగా మరో 150 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద ఇంకా వందల మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన స్థలంలో యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతున్నాయి.