- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Reservations : “ఆ రిజర్వేషన్లు అక్కర్లేదు’’..కర్ణాటక ప్రభుత్వంపై కేరళ మంత్రి ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో : ప్రైవేట్ రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును కర్ణాటక ప్రభుత్వం రూపొందించడంపై కేరళ మంత్రి పి రాజీవ్ భగ్గుమన్నారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక సర్కారు భావించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిభావంతులైన యువతకు రిజర్వేషన్ల అవసరమే లేదని రాజీవ్ స్పష్టం చేశారు. తమ రాష్ట్రం (కేరళ)లో ఏ కంపెనీ పెట్టుబడి పెట్టినా ట్యాలెంట్ కలిగిన యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తామని ఆయన తెలిపారు.
అయితే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాధాన్యతా రంగాల్లోని ఉద్యోగ అవకాశాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత దక్కేలా కేరళ పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు. కాగా, కన్నడిగులకు ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో 50 శాతం, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే ముసాయిదా బిల్లును ప్రస్తుతానికి కర్ణాటక సర్కారు నిలుపుదల చేసింది. దానిపై త్వరలో సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నారు.