United Nations: అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం.. హెజ్‌బొల్లాపై దాడులు ఖండించిన ఐక్యరాజ్యసమితి

by Shamantha N |
United Nations: అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం.. హెజ్‌బొల్లాపై దాడులు ఖండించిన ఐక్యరాజ్యసమితి
X

దిశ, నేషనల్ బ్యూరో:హెజ్ బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఐక్యరాజ్యసమితి ఖండించింది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో లెబనాన్‌ ను రక్తసిక్తం చేసిన ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని తెలిపింది. దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది. మరోవైపు, ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా దాడుల దృష్ట్యా యూఎన్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. హానిచేయని పోర్టబుల్‌ వస్తువుల్లో ట్రాప్‌ పరికరాలు వాడటం సరికాదని మానవహక్కుల హైకమిషనర్‌ వోల్కర్‌ టర్క్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించారు. ఇదంతా ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడటం, యుద్ధం నేరం కిందకే వస్తుందన్నారు. ఈ దాడుల్లో సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళకు గురయ్యారని వెల్లడించారు. ఈ దాడులు తనను ఎంతో భయాందోళకు గురిచేశాయని వోల్కర్‌ వెల్లడించారు. ఈ దాడులు యుద్ధాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు. కమ్యూనికేషన్‌ సాధనాలను ఆయుధాలుగా మార్చడాన్ని ఆయన ఖండించారు.

యూఎన్ లోని ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే?

ఇక, హెజ్‌బొల్లాలో పరికరాల పేలుళ్ల ఘటనపై స్పందించేందుకు యూఎన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ నిరాకరించారు. కానీ, లెబానాన్‌లోని హెజ్‌బొల్లాతో యుద్ధం చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ దాడులను కొనసాగించలేమని డానన్‌ పేర్కొన్నారు. బీరుట్‌లో జరిగిన సమ్మెలో హిజ్బుల్లా ఎలైట్ యూనిట్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఇష్టపడుతుందని, ఈ దాడులు మరింత తీవ్రతరం కాకుండా "నిరోధించాలని" కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ ఉపయోగించే కమ్యూనికేషన్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో రెండు రోజుల్లో కనీసం 37 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed