Quad Summit: క్వాడ్ సమ్మిట్‌ ఎజెండాగా ఉక్రెయిన్, గాజా, క్యాన్సర్‌పై పోరాటం అంశాలు

by S Gopi |
Quad Summit: క్వాడ్ సమ్మిట్‌ ఎజెండాగా ఉక్రెయిన్, గాజా, క్యాన్సర్‌పై పోరాటం అంశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ నేతలతో కూడిన వార్షిక క్వాడ్ సమ్మిట్ ఈ వారాంతంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణలు, సముద్ర భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్‌పై పోరాటంపై దృష్టి పెట్టనున్నారు. సెప్టెంబరు 21న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వస్థలమైన డెలావేర్‌లో సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాలతో సమావేశమవుతారు. 2021 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు నేతలు క్వాడ్ సమ్మిట్‌లో భేటీ అయ్యారు. యాదృచ్ఛికంగా, ఐదవ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించాల్సి ఉండగా.. నేతలకు పర్యటన విషయంలో ఇబ్బందుల కారణంగా ఆతిథ్యం అమెరికాకు మారింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బిడెన్ తప్పుకోవడంతో తన సొంతగడ్డపై ఇతర దేశాధి నేతలకు వీడ్కోలు పలికేందుకు ఈ సమ్మిట్ భాగం కానుంది. వచ్చే ఏడాది సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Advertisement

Next Story

Most Viewed