- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉక్రెయిన్ సంక్షోభంపై.. ఇటలీ ప్రధాని భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతి పూర్వకంగా పరిష్కారం ఇచ్చేందుకు భారత్ పూర్తి సన్నద్ధతతో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇద్దరు అధినేతలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జీ20 అధ్యక్షత సమయంలో ఉక్రెయిన్‌లో శత్రుత్వ విరమణ ప్రక్రియను సులభతరం చేయడం లో, చర్చలు జరపడం లో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్లు మెలోని అన్నారు.
ప్రధాని మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని కొనియాడారు. ఉక్రెయిన్ వివాదం అభివృద్ధి చెందుతున్న దేశాలపై చూపుతున్న దుష్ప్రభావం పై తాను, ఇటలీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేశామని మోడీ చెప్పారు. అన్ని దేశాలపై ఆహారం, ఎరువులు, ఇంధన సంక్షోభానికి తెరలేపిందని తెలిపారు. ముందు నుంచి భారత్ చర్చల ద్వారానే యుద్ధానికి పరిష్కారం చూపుతుందని చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఎలాంటి శాంతి ప్రక్రియ కైనా తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు.
ఇరు దేశాలు సంయుక్తంగా స్టార్టప్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, సెమికండక్టర్స్, టెలికాం రంగాల్లో సహకారాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇరు దేశాలు టెర్రరిజం, విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని చెప్పారు. అంతకుముందు దేశంలో ప్రతి ఏటా నిర్వహించే బహుపాక్షిక సదస్సు రైసినా డైలాగ్ ఎనిమిదో ఎడిషన్‌కు హాజరయ్యేందుకు ఇటలీ ప్రధాని గురువారం దేశ రాజధానికి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ చేరుకున్న జార్జియాకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు.