Tamil Nadu Deputy CM: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..!

by Shamantha N |
Tamil Nadu Deputy CM: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన్ని డిప్యూటీ సీఎంగా నియమించేందుకు డీఎంకే మొగ్గు చూపుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్. ప్రస్తుతం, ఆయన రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. రేపటిలోగా ఆయన్ని డిప్యూటీ సీఎంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే, ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నట్లు ఇటీవలే స్టాలిన్ హింట్ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ కూడా ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా అభివర్ణించారు.

మంత్రి రాజకన్నప్పన్ ఏమన్నారంటే?

కాగా.. తమిళనాడు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్య, వైద్యం రెండు కళ్లలాంటివన్న ముఖ్యమంత్రి.. విద్యను ఎంతగానో ఆదరిస్తారని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అనే శాఖ ఉంటేనే ప్రయోజనం అని అన్నారు. “ఇది మా ఉపముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది.. క్షమించండి, మా మంత్రి ఉదయనిధిని ఆగస్టు 19కి ముందు పిలవలేము" అని ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేస్తారని హింట్ ఇచ్చారు. కానీ, ఆతర్వాత దీని గురించి డీఎంకే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇకపోతే, క్రీడలు,యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కాకుండా, ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖను కూడా ఉదయనిధి స్టాలిన్ నిర్వహిస్తున్నారు. ఇటీవలే, చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి కీలక ప్రాజెక్టుల అమలు తీరును ఆయన పరిశీలించి సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed