టెలికాం కంపెనీల పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

by Harish |
టెలికాం కంపెనీల పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సహా వివిధ టెలికాం కంపెనీలు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR)బకాయిలపై గతంలో ఇచ్చిన ఆదేశాలపై క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతకుముందు AGR బకాయిలు భారీగా పెరగడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం గణనలో లోపాలు చోటుచేసుకున్నాయిని టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. లోపాలను సరిచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే తిరిగి వాటిని సరిదిద్దడానికి క్యూరేటివ్ పిటిషన్‌లను "ఓపెన్ కోర్ట్"లో విచారించాలని సుప్రీంకోర్టును కంపెనీలు అభ్యర్థించాయి. తాజాగా సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌కుమార్‌, జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తిరస్కరించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 2020 నాటికి టెలికాం ఆపరేటర్లు చెల్లించాల్సిన మొత్తం రూ. 1.47 లక్షల కోట్ల AGR బకాయిల్లో దాదాపు 75% వడ్డీ, పెనాల్టీ, పెనాల్టీపై వడ్డీని కలిగి ఉన్నాయని కంపెనీలు తెలిపాయి. లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీ రూ.55,054 కోట్లు. సాధారణంగా ఇలాంటి పిటిషన్లను న్యాయమూర్తులు ఛాంబర్‌లో పరిశీలించి విచారణకు అర్హత ఉందో లేదో నిర్ణయిస్తారు. ప్రత్యేకమైన అభ్యర్థనలు ఉంటే ఓపెన్‌ కోర్టు విచారణకు అనుమతిస్తారు.

Advertisement

Next Story