TG HighCourt: కౌంటర్ దాఖలు చేసిన ACB

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-27 15:54:09.0  )
TG HighCourt: కౌంటర్ దాఖలు చేసిన ACB
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E Car Race) కేసులో ఏసీబీ(ACB) అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కేటీఆర్ నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం ఏసీబీ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్(KTR) తరపు న్యాయవాదిని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. ఫార్ములా ఈ-ఆ కారు రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌(Quash Petition)పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

కేటీఆర్‌ను ఈనెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేయగా.. వెంటనే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు.. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలకశాఖ కార్యదర్శి దానకిషోర్‌ సైతం కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దానకిషోర్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు.


Read More..

బౌన్సర్.. టెర్రర్! వివాదాస్పదంగా మారిన ప్రైవేట్ సెక్యూరిటీ

Advertisement

Next Story

Most Viewed