కరెంటు బిల్లు కట్టమంటే దాడి చేశారు

by Sridhar Babu |
కరెంటు బిల్లు కట్టమంటే దాడి చేశారు
X

దిశ, కూకట్​పల్లి : పెండింగ్​లో ఉన్న విద్యుత్​ బిల్లు కట్టమని అడిగితే విద్యుత్​ శాఖ సిబ్బందిపై ఇంటి యజమాని దాడి చేసిన సంఘటన కేపీహెచ్​బీలో చోటు చేసు కుంది. కేపీహెచ్​భీ కాలనీలోని ఓ ఇంటి యజమాని బకాయి ఉన్న 2 వేల రూపాయలు కట్టక పోవడంతో విద్యుత్​ సరఫరా కట్​ చేసేందుకు ప్రయత్నించి విద్యుత్​ శాఖ సిబ్బంది శ్యామ్​పై సదరు ఇంటి యజమానితో పాటు మరొకరు దాడికి దిగారు. శ్యామ్​కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి శ్యామ్​ను బూతులు తిడుతూ బిల్లు కట్టము ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దబాయించారు. దీంతో శ్యామ్​ కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed