- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల అరాచాకాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ డబ్బులు(Online Money) తీసుకొని చెల్లించడం లేదని వేధింపులు చేయడంతో.. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్య సైబర్ మోసగాళ్ల(Cyber fraudsters) ఉచ్చులో పడకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట(Sullurupeta)లో లోన్(Loan) డబ్బులు కట్టాలని యువతిని వేధింపులకు గురి చేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సూళ్లూరు పేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 6 నెలల క్రితం ఆమె ఫినబుల్ యాప్‌లో లోన్ తీసుకున్నట్లు తెలిపింది. సమయానికి EMI చెల్లించకపోవడంతో తన ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అంతేకాదు బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి డబ్బులు కట్టలేదని చెప్పారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి కొన్ని న్యూడ్ ఫొటోలు కూడా పంపించారు. ఏజెంట్ల వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పై సీరియస్‌గా స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరమని జిల్లా ఎస్పీ తెలిపారు.